HomeVideosభీమ్లా నాయక్ ట్రైలర్ టాక్ : ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

భీమ్లా నాయక్ ట్రైలర్ టాక్ : ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

భీమ్లా నాయక్ ట్రైలర్ టాక్ : ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ
భీమ్లా నాయక్ ట్రైలర్ టాక్ : ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసింది. సోమవారం ఉదయం నుంచి ట్రైలర్ విడుదలపై అంత ఎదురుచూస్తూ వచ్చారు. రాత్రి 8:10 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. గంటలు గడుస్తున్నా కొద్దీ హైప్ పెంచేశారు. కానీ తీరా చూస్తే హ్యాండ్ ఇచ్చారు. 8:10 గంటలకు వస్తుంది కదా? అని ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తుండగా..9 గంటలకు రిలీజ్ చేస్తామని తెలిపే సరికి కాస్త నిరుత్సహపడ్డారు. తొమ్మిది కైనా వస్తుందో రాదో అనుకున్నారు కానీ సరిగ్గా తొమ్మిది గంటలకు రిలీజ్ చేసి అభిమానులను ఖుషి చేసారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే..`ఏంటీ బాలాజీ స్పీడు పెంచావ్ `అంటూ రానా వాయిస్ తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. రానా డైలాగ్ కు `ఇదీ పులులు తిరిగే ప్రాంతమట బాబూ అని కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అనడం… `పులి పెగ్గేసుకుని పడుకుంది గనీ నువ్వు స్లోగానే పోనియ్ అంటూ రానా మళ్లీ కౌంటర్ గా చెప్పడం… డానియల్ శేఖర్ అంటూ ఓ వాయిస్ వినిపించగానే రానా సీరియస్ లుక్ లో నడుస్తున్న తీరు.. ఆ వెంటనే పోలీస్ డ్రెస్ లో బుల్లెట్ పై పవన్ ఎంట్రీ ఇచ్చారు ..సర్ హద్ భీమ్లా నాయక్.. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్  శ్రీశైలం తాసిల్ అంకేశ్వరం మండలం ఆంధ్ర ప్రదేశ్ అంటూ తుపాకీ తూటాలు పేల్చడం.. ఆ తరువాత చెడ్డీపై రానాని అరెస్ట్ చేసి జీప్ బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి తీసుకెళ్లడం.. స్టేషన్ లో పవన్ ముందు కాలుపై కాలు వేసుకుని ఠీవీగా కూర్చుని రానా సవాలు చేస్తున్న తీరు… పవన్ యాటిట్యూడ్ కి రానా లేచి కుర్చీని తన్నడం ఇవన్నీ హైలైట్ గా అనిపించాయి.

- Advertisement -

ఒంటిమీద యూనిఫామ్ చూసుకుని పొగర్రా.. అని రావు రమేష్ అంటుంటే యస్.. అంటూ పవన్ సైగ చేయడం.. `ఏం నాయక్ నువ్వు పేల్చినప్పుడు వాడు లోపల లేడా చూస్కోవాలి కదా.. అని నిత్యామీనన్ అంటుంటే .. మురళీ శర్మ `గొప్పదానివి దొరికావమ్మా` అనడం.. పవన్ నిత్యామీనన్ మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలు చూపించడం ట్రైలర్ లో చూపించారు.  ఓవరాల్ గా ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అన్ని పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇక ట్రైలర్ చివర్లో రానా..ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ చెప్పడం ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All