
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం భీమ్లా నాయక్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా వాటికి రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక నిన్న భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ “లా లా భీమ్లా”ను విడుదల చేసారు. ఈ పాట విడుదలైనప్పటి నుండి యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. సరికొత్తగా ఈ సాంగ్ ను పిక్చరైజ్ చేయడంతో పాటు ట్యూన్ కూడా మాస్ గా ఉండడంతో పవన్ ఫ్యాన్స్ కు కావాల్సినంత ఊపు వచ్చింది .
ఈ సాంగ్ కు లిరిక్స్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ రాయగా అరుణ్ కౌండిన్య పాడాడు. రిపీట్ వ్యూస్ ను దక్కించుకుంటున్న ఈ సాంగ్ ఒక్క రోజులోనే 11.3 మిలియన్ వ్యూస్ ను దాటేసింది. దీంతో సౌత్ ఇండియాలో తొలి 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన సౌత్ ఇండియన్ సాంగ్ గా నిలిచింది.
భీమ్లా నాయక్ పై బజ్ చాలా బాగుంది. ముందుగా సంక్రాంతికి ఈ చిత్రం వస్తుందనుకున్నా ఇప్పుడు తేదీలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. సమ్మర్ కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. రానా దగ్గుబాటి డేనియల్ శేఖర్ గా మరో లీడ్ రోల్ ను పోషిస్తున్న విషయం తెల్సిందే.