Homeటాప్ స్టోరీస్భీమ్లా నాయక్ మూవీ టాక్ : ఇక రికార్డ్స్ రాసుకోవడమే

భీమ్లా నాయక్ మూవీ టాక్ : ఇక రికార్డ్స్ రాసుకోవడమే

Bheemlanayak-talk

పవర్ స్టార్ తన పవర్ ను చూపేందుకు భీమ్లా నాయక్ గా థియేటర్స్ లోకి వచ్చేసాడు. వారం రోజులుగా అభిమానులు , సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు 25 వ డేట్ వస్తుందా..ఎప్పుడెప్పుడు తమ దేవుడ్ని తెరపై చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో భారీ అంచనాల మధ్య ఈ మూవీ రిలీజ్ అయ్యింది.

వాస్తవానికి జనవరి సంక్రాంతి రేస్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసినప్పటికీ పలు కారణాల కారణంగా ఫిబ్రవరి 25 కు వాయిదా పడింది. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు. మరి ఈ మూవీ ఎలా ఉంది..? పవర్ స్టార్ పవర్ చూపించాడా..? ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్యలో కొనసాగే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు..? అభిమానులు ఏమంటున్నారు..? అనేవి ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

ఓవర్సీస్ తో పాటు తెలంగాణ లో ఇప్పటీకే బెనిఫిట్ షోస్ పూర్తి కావడం తో సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సినిమా బ్లాక్ బస్టర్ అని బల్లగుద్ది చెపుతున్నారు. పవన్ కళ్యాణ్ , రానా ఇద్దరు ఎక్కడ తగ్గడలేదని , నటనలో కుమ్మేశారని అంటున్నారు. ఇక థమన్ మ్యూజిక్ కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి కానీ చెప్పాల్సిన పనిలేదు. థియేటర్స్ లలో స్పీకర్లు పగిలిపోవాల్సిందే అని చెపుతున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ సూపర్బ్ అని , సాగర్ డైరెక్షన్ కేక పుట్టించిందని , ఇక ఎక్సలెంట్ క్లయిమాక్స్.. ఇలా అన్ని అంశాలు హైలైట్ గా ఉన్నాయని అంటున్నారు. మరికొంతమంది ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉందని అంటున్నారు. ఇక క్లయిమాక్స్ ఫైట్ కు అయితే ఫ్యాన్స్ విజిల్స్ వేయడం కాయమని, ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్యలో కొనసాగే ఈ యుద్ధంలో ఇద్దరు హీరోలు చాలా ఈక్వల్ గా నటించినట్లు చెబుతున్నారు. ఓవరాల్ గా భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ అని, రికార్డ్స్ రాసుకోవడమే అని చెపుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All