Homeటాప్ స్టోరీస్భీమ్లా నాయక్ రివ్యూ : పక్కా మాస్ పవర్ ప్యాక్

భీమ్లా నాయక్ రివ్యూ : పక్కా మాస్ పవర్ ప్యాక్

Bheemla nayak Review
Bheemla nayak Review

నటీనటులు: పవన్ కల్యాణ్, రానా , నిత్య మీనన్, సంయుక్త మీనన్, సముద్ర ఖని తదితరులు
దర్శకత్వం: సాగర్ కే చంద్ర
స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ
మ్యూజిక్: తమన్
రిలీజ్ డేట్ : 25 -02-2022
రేటింగ్ : 3.5/5

పవర్ స్టార్ తన పవర్ ను చూపేందుకు భీమ్లా నాయక్ గా థియేటర్స్ లోకి వచ్చేసాడు. వారం రోజులుగా అభిమానులు , సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు 25 వ డేట్ వస్తుందా..ఎప్పుడెప్పుడు తమ దేవుడ్ని తెరపై చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో భారీ అంచనాల మధ్య ఈ మూవీ రిలీజ్ అయ్యింది. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు.

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు. మరి ఈ మూవీ ఎలా ఉంది..? పవర్ స్టార్ పవర్ చూపించాడా..? ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్యలో కొనసాగే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు..? థమన్ మ్యూజిక్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది..? త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ పడ్డాయా..లేదా..? అసలు కథ ఏంటి..? ప్లస్ , మైనస్ లు ఏంటి..? అనేది ఇప్పుడు పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :
వరంగల్ మాజీ ఎంపీ (సముద్ర ఖని) కుమారుడైన డేనియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. పూర్తి పొగరుతో నిండిన వ్యక్తి..అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో మద్యపానంపై ఆంక్షలు ఉన్న ప్రదేశంలో పీకల దాకా తాగి పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్ అయినా భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్ ) పట్టుబడతాడు. డేనియల్ శేఖర్ ను అరెస్ట్ చేసిన భీమ్లా నాయక్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తాడు. రాజకీయంగా పలుకుబడి ఉండటంతో సీఐ సూచన మేరకు డేనియల్ శేఖర్‌కు పోలీస్ స్టేషన్‌లో మర్యాదలు చేయడం.. మద్యం సరఫరా చేయడం వంటివి చేస్తారు. దీంతో భీమ్లా నాయక్ ను సస్పెండ్ చేస్తారు ఫై అధికారులు.

సస్పెండ్ గురైన భీమ్లా నాయక్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? భీమ్లా నాయక్‌ను డేనియల్ శేఖర్ ఎలాంటి కేసులో ఇరికించాడు? తనను అరెస్ట్ చేసిన భీమ్లా నాయక్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటాడు ? డేనియల్ శేఖర్‌కు – భీమ్లా నాయక్ కు ఎలాంటి యుద్ధం నడిచింది..? చివరకు ఎవరు గెలిచారు..? భీమ్లా నాయక్ భార్య సుగుణ (నిత్య మీనన్) పాత్ర ఎలా ఉంది..? ఇవన్నీ తెలియాలంటే మీరు చూడాల్సిందే.

ప్లస్ :
* పవన్ కళ్యాణ్ , రానా యాక్టింగ్
* థమన్ మ్యూజిక్
* సెకండ్ హాఫ్
* త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్
* సాగర్ డైరెక్షన్

మైనస్ :
* యాక్షన్ సీన్స్
* ఒకే దానిపై సినిమా అంత నడవడం
* అక్కడక్కడా కొన్ని సీన్లు బోర్ కొట్టించడం
* కామెడీ

సాంకేతిక వర్గం :
* థమన్ మరోసారి చించేసాడు. సాంగ్స్ మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు సైతం కుమ్మేసాడు.
* రవి కే చంద్రన్ సినిమాఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది.
* ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ మరోసారి తన సత్తా చాటుకున్నారు.
* సితారా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

* త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు సినిమాకు ఆకర్షణ గా నిలిచాయి. అభిమానులు పవన్ నుండి ఎలాంటి డైలాగ్స్ కోరుకుంటారో ఆలా రాసి ఆకట్టుకున్నారు. రానా – పవన్ ల మధ్య వచ్చే సీన్స్ , డైలాగ్స్ థియేటర్స్ లలో ఈలలు వేయించాయి. తండాకు సంబంధించిన సీన్లు, అలాగే సెకండాఫ్‌లో ఫ్యాష్ బ్యాక్ సన్నివేశాలు.. అలాగే క్లైమాక్స్ ఫైట్‌ లో వచ్చే డైలాగ్స్ బాగా పేలాయి.

* ఇక డైరెక్టర్ సాగర్ కె చంద్ర విషయానికి వస్తే..రీమేక్ మూవీ అయినప్పటికీ ఎక్కడ కూడా ఆ ఛాయలు లేకుండా తెరకెక్కించి ఆకట్టుకున్నారు. పవన్ ఇమేజ్ ను దృష్టి లో పెట్టుకొని సినిమాను రూపుదిద్దారు. రానా , పవన్ ఇద్దర్ని కూడా సమానంగా చూపించి..అభిమానులు ఎక్కడ డిస్పాయింట్ కాకుండా చూసుకున్నాడు.

నటీనటుల తీరు :
* పవన్ కళ్యాణ్ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ లో పలు రకాల కోణాల్లో నటించి అలరించారు. నిజాయితీగల పోలీస్ ఆఫీసర్‌గా, అలాగే తండాలో గిరిజన ప్రజల కోసం ప్రాణాలకు తెగించే యువకుడిగా. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే సంస్కారవంతుడిగా, పేదల కష్టం వస్తే తోడుంటే మనిషిగా ఇలా అన్ని యాంగిల్స్ లలో ఆకట్టుకున్నారు. అలాగే రానా తో వచ్చే ప్రతి సీన్లలో పవన్ చాల బాగా చేసాడు. ఇద్దరి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం అలరించింది.

* ఇక రానా డేనియల్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు. పొగరు ఉన్న రాజకీయ నేతగా అదరగొట్టాడు. అంతే కాదు అక్కడక్కడా పవన్ కంటే బాగా తన నటనతో ఆకట్టుకున్నాడు.

* సుగుణ పాత్రలో నిత్యమీనన్ చాల బాగాచేసింది. రొమాంటిక్ సీన్లు, ఎమోషనల్ సీన్లలో ఆమె తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. మరో నటి సంయుక్త మీనన్ తన పాత్రకు తగ్గట్లు నటించింది.

* సముద్రఖని , రఘుబాబు, నర్రా శ్రీనివాస్ తదితరులు తమ పాత్రల మేరకు నటించారు.

ఫైనల్ గా : అభిమానులు కోరుకునే పక్క మాస్ ఎంటర్టైనర్ ‘భీమ్లా నాయక్’.

రేటింగ్ : 3.5/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All