సోమవారం భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. కానీ అభిమానులు అంచనాలు అందుకోవడం విఫలమైంది. ముఖ్యముగా థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాములుగా ఉండడం..త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ మిస్ కావడం తో అభిమానులు నిరాశ వ్యక్తం చేసారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత పెద్ద ఎత్తున థమన్ , త్రివిక్రమ్ ఫై విమర్శలు చేయడం తో చిత్ర యూనిట్ అలర్ట్ అయ్యింది.
బుధువారం ప్రీ రిలీజ్ వేడుక లో కొత్త ట్రైలర్ రిలీజ్ చేసి దుమ్ములేపారు. అసలైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో థమన్ కుమ్మేసాడు. ఈ ట్రైలర్ తో అభిమానుల కోరిక నెరేవేరడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో గ్రాండ్ గా జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులే కాక ఇతర రాష్ట్రాల్లో ఉన్న మెగా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక కొత్త ట్రయిలర్ ఫై మీరు ఓ లుక్ వెయ్యండి.
