Homeన్యూస్భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక తేదీ , వేదిక ఫిక్స్..?

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక తేదీ , వేదిక ఫిక్స్..?

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక తేదీ , వేదిక ఫిక్స్..?
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక తేదీ , వేదిక ఫిక్స్..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – దగ్గుబాటి రానా కలయికలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు.

మొన్నటి వరకు ఈ మూవీ రిలీజ్ డేట్ ఫై అనేక అనుమానాలు నెలకొని ఉండేది. కానీ రాత్రి రాత్రికే అన్ని అనుమానాలను పటాపంచలు చేసారు నిర్మాత నాగ వంశీ. ఈ సినిమా ఫిబ్రవరి 25 న వస్తున్నట్లు ప్రకటించి అభిమానుల్లో ఆనందం నింపారు. ఇక రిలీజ్ కు పది రోజులే ఉండడం తో చిత్ర ప్రమోషన్ ఎలా చేస్తారో అని కొంతమంది మాట్లాడుకుంటుంటే..అసలు పవన్ చిత్రానికి ప్రమోషనే అవసరం లేదని అభిమానులు అంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

ప్రస్తుతం ఫిలిం నగర్ సమాచారం మేరకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్‌ నగరంలోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఎంతో గ్రాండ్‌గా చేయబోతున్నారట. విశాలవంతమైన ప్రదేశం కావడంతో దీనికి కొన్ని వేల మంది వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం. మరోపక్క పవన్ కళ్యాణ్ తన పాత్రకు సంబదించిన డబ్బింగ్ ను నిన్న పూర్తి చేయడం జరిగింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All