Homeన్యూస్భీమ్లా నాయక్ లో ఆ ఎపిసోడ్ హైలైట్ గా ఉంటుందట

భీమ్లా నాయక్ లో ఆ ఎపిసోడ్ హైలైట్ గా ఉంటుందట

భీమ్లా నాయక్ లో ఆ ఎపిసోడ్ హైలైట్ గా ఉంటుందట
భీమ్లా నాయక్ లో ఆ ఎపిసోడ్ హైలైట్ గా ఉంటుందట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి చేస్తోన్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా. మలయాళంలో పృథ్వీరాజ్, బిజూ మీనన్ పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఇద్దరి మధ్యా వచ్చిన ఇగో సమస్యలు చిత్రాన్ని ముందుకు నడిపిస్తాయి.

అయితే తెలుగుకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత పెరిగింది. టైటిల్ కూడా పవన్ పేరు మీదనే పెట్టారు. ఇక ఈ చిత్రంలో మరో స్పెషల్ హైలైట్ ఉంటుందిట. పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ భీమ్లా నాయక్ సినిమాలో స్పెషల్ హైలైట్ గా నిలుస్తుందిట. మలయాళంలో కూడా ఈ ఎపిసోడ్ బాగుంటుంది కానీ తెలుగులో మరింత ప్రాధాన్యత తీసుకొచ్చారట.

- Advertisement -

భీమ్లా నాయక్ నుండి సెకండ్ సింగిల్ అంత ఇష్టం, పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ మధ్య వచ్చేది 15వ తారీఖున విడుదల కాబోతోంది. ప్రస్తుతం భీమ్లా నాయక్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరో నెల రోజుల్లో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయనున్నారు. జనవరి 12, 2022న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలియజేసిన విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All