
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ బ్రేక్ ఈవెన్ కు దగ్గర్లో ఉంది. సాగర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో రానా విలన్ రోల్ లో కనిపించగా నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ లు హీరోయిన్లు గా నటించారు. భారీ అంచనాల మధ్య గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపిస్తుంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అదే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో సినిమాకు బ్రేక్ ఈవెన్ దక్కాలంటే రూ. 108 కోట్ల వసూళ్లు సాధించాలి. ప్రస్తుతం రూ.87.79 కోట్ల షేర్ వచ్చినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 20.21 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. ఈ వారంలో అవి కూడా వచ్చితీరుతాయని అంటున్నారు.