
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో తెలియంది కాదు..ఆయన నటించిన సినిమాకు ప్లాప్ టాక్ వచ్చిన సరే బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే కలెక్షన్లు వస్తాయి. అలాంటిది బ్లాక్ బస్టర్ టాక్ వస్తే..బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామినే. తాజాగా ఈయన నటించిన భీమ్లా నాయక్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ మూవీ..ఓటిటి లో కూడా దుమ్ములేపుతుంది. మార్చి 24 నుండి ఆహా , డిస్ని ప్లస్ హాట్ స్టార్ లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో ఆహాలో భారీ స్పందన దక్కుతున్నట్లు ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా వెల్లడించింది. తక్కువ సమయంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను పూర్తి చేసిందని… ఆహాలో ఈ ఘనతను అందుకున్న మొదటి ఇండియన్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసినట్లు తెలిపారు. ఈ ప్రకటన తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. థమన్ సంగీతాన్ని అందించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే , మాటలు అందించారు.