Homeటాప్ స్టోరీస్పవన్ ఫ్యాన్స్ కు షాక్ : ఆన్లైన్ లో భీమ్లా నాయక్ ఫుల్ మూవీ

పవన్ ఫ్యాన్స్ కు షాక్ : ఆన్లైన్ లో భీమ్లా నాయక్ ఫుల్ మూవీ

Bheemlanayak-talk

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా కలయికలో వచ్చిన భీమ్లా నాయక్ మూవీ ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా మాస్ ఎంటర్టైనర్ అని , చాల ఏళ్ల తర్వాత పవన్ నుండి అసలు సిసలైన యాక్షన్ చూశామని గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాగే ఓపెనింగ్స్ కూడా రికార్డు స్థాయి లో వస్తాయని అంత నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భీమ్లా నాయక్ ఫుల్ మూవీ ఆన్లైన్ లో పెట్టేశారనే వార్త ఇప్పుడు చిత్ర మేకర్స్ ను షాక్ కు గురి చేస్తుంది.

గత కొన్నేళ్లుగా చిత్రసీమ ను కోలుకోలేకుండా చేస్తున్న తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వంటి సంస్థలు ఇప్పుడు భీమ్లా నాయక్ ను కూడా వదిలిపెట్టలేదు. ఇప్పటికే ఎన్నో భారీ చిత్రాలతో పాటు చిన్న చిత్రాలను మొదటి రోజే ఆన్‌లైన్‌లో పెట్టేసి నిర్మాతలను నష్టపరుస్తున్న ఈ సైట్స్.. తాజాగా ‘భీమ్లా నాయక్’ మూవీని కూడా లీక్ చేసేశాయి. ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని గంటల్లోనే డౌన్‌లోడ్ లింక్‌ను పెట్టడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దీని ప్రభావం మూవీ కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపించే ప్రమాదం ఉందని అంత భయపడుతున్నారు. మరి త్వరగా చిత్ర యూనిట్ దీనిపై యాక్షన్ తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ దీనికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు డైలాగ్‌లను ఇచ్చాడు. థమన్ ఈ మవీకి సంగీతం సమకూర్చాడు. ఇక, ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All