Homeటాప్ స్టోరీస్భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం కుదిరిందిగా!

భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం కుదిరిందిగా!

భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం కుదిరిందిగా!
భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం కుదిరిందిగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో రూపొందుతోన్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోశియుమ్ కు అధికారిక రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ భీమ్లా నాయక్ కు అదిరిపోయే సంగీతాన్ని రెడీ చేస్తున్నాడని తెల్సింది.

ఇక ఇటీవలే వచ్చిన భీమ్లా నాయక్ టీజర్ కు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుండి మొదటి సింగిల్ విడుదల కాబోతోంది. భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం కుదిరింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఉదయం 11 గంటల 16 నిమిషాలకు టైటిల్ ట్రాక్ ను విడుదల చేయబోతున్నారు.

- Advertisement -

వచ్చే సంక్రాంతికి భీమ్లా నాయక్ విడుదల కాబోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All