
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయక్ సెన్సార్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మూవీ లో రానా విలన్ రోల్ లో నటిస్తుండగా ..పవన్ కు జోడిగా నిత్యా మీనన్ , రానా కు జోడి గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సాగర్ కే డైరెక్ట్ చేస్తుండగా…త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా మేకర్స్ సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసారు.
సినిమాను చూసిన సెన్సార్ బృందం సినిమా కు U/A సర్టిఫికెట్ జారీ చేసారు. సినిమా చాల బాగా వచ్చిందని , రీమేక్ అయినప్పటికీ ఆ ఛాయలు ఎక్కడ కనిపించకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాను తెరకెక్కించారని సెన్సార్ సభ్యులు అభినందించినట్లు తెలుస్తుంది.
సెన్సార్ టాక్ తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేయగా, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఓవర్సీస్ లో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ మొదలు కావడమే కాదు రికార్డ్స్ సృష్టిస్తుంది.
#BheemlaNayak censor formalities are done & certified with U/A! ?
All set for #BheemlaNayakOn25thFeb ?✨ @pawankalyan @RanaDaggubati #Trivikram @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @vamsi84 @sitharaents @adityamusic pic.twitter.com/33qvpHOL9w
— Saagar K Chandra (@saagar_chandrak) February 18, 2022