Homeటాప్ స్టోరీస్రోజు రోజుకు భారీగా పడిపోతున్న భీమ్లా కలెక్షన్స్

రోజు రోజుకు భారీగా పడిపోతున్న భీమ్లా కలెక్షన్స్

bheemla Nayak first day collections

భీమ్లా నాయక్ కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి. మొదటి మూడు, ఐదు రోజుల్లో భారీగా వసూళ్లు రాబట్టగా..ఆ తర్వాతి రోజు నుండి చాల థియేటర్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. కొన్ని థియేటర్స్ జనాలు లేక షోస్ రద్దు చేసే పరిస్థితి వస్తున్నట్లు తెలుస్తుంది. రానా , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సారి కలిసి నటించిన భీమ్లా నాయక్.. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అంధించగా యువ దర్శకుడు సాగర్ కె చంద్ర సినిమాను అద్భుతమైన టేకింగ్ తో హిట్ కొట్టాడు. మొదటి రోజు మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మొదటి మూడు రోజులు హౌస్ కలెక్షన్లతో కొనసాగగా..నాల్గో రోజు కాస్త తగ్గాయి. ఐదో రోజు మళ్లీ పుంజుకున్నాయి. కానీ ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి. ఇక 8 వ రోజు మాత్రం భారీగా పడిపోయినట్లు తెలుస్తుంది.

- Advertisement -

* నైజాంలో రూ. 20 లక్షలు
* సీడెడ్‌లో రూ. 16 లక్షలు
* ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు
* ఈస్ట్‌లో రూ. 7 లక్షలు
* వెస్ట్‌లో రూ. 5 లక్షలు
* గుంటూరులో రూ. 5 లక్షలు
* కృష్ణాలో రూ. 6 లక్షలు
* నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి శుక్రవారం రోజు రూ. 74 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.25 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. అయితే ఈ సినిమా 8 రోజుల్లో రూ. 90.60 కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే మరో రూ. 17.40 కోట్లు వస్తేనే సినిమా హిట్ కొట్టినట్లు. అవి ఈ వారంలో ఎలాగైనా వస్తాయని అంటున్నారు. ఎందుకంటే ఈ వారం వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు టాక్ యావరేజ్ రావడం తో ప్రేక్షకులు భీమ్లా నాయక్ వైపే మొగ్గు చూపిస్తారని అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All