Homeటాప్ స్టోరీస్భీమ్లా నాయక్ జోరు 12 వ రోజు బాగా తగ్గింది

భీమ్లా నాయక్ జోరు 12 వ రోజు బాగా తగ్గింది

bheemla nayak first week collections
bheemla nayak first week collections

భీమ్లా నాయక్ జోరు రోజు రోజుకు భారీగా తగ్గుతుంది. కోట్ల నుండి లక్షల్లోకి చేరింది. దీంతో అందరిలో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రివేంజ్ డ్రామాగా ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించడం విశేషం. ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా . సముద్రఖని , రావు రమేష్ , మురళి శర్మ లు ముఖ్యపాత్రల్లో నటించారు. మొదటిరోజు మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ మొదటి మూడు రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద హౌస్ ఫుల్ కలెక్షన్ల తో కుమ్మేసింది. నాల్గో రోజు కాస్త కాస్త తగ్గుతూ వచ్చాయి. ఇక 12 వ రోజు బాగా తగ్గాయి.

- Advertisement -

భీమ్లా నాయక్ 12వ రోజు వసూళ్లు
నైజాం 6 లక్షలు
సీడెడ్‌ 4 లక్షలు
ఉత్తరాంధ్ర 4 లక్షలు
ఈస్ట్‌ గోదావరి 3 లక్షలు
వెస్ట్‌ గోదావరి 2 లక్షలు
గుంటూరు 3 లక్షలు
కృష్ణా 3 లక్షలు
నెల్లూరు 2 లక్షలు
మొత్తంగా చూస్తే 27 లక్షల షేర్‌‌ 50 లక్షల గ్రాస్ వచ్చింది. ఇక ఈ 12 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 74.74 కోట్లు షేర్ 114.10 కోట్ల గ్రాస్‌ వసూలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 95.38 కోట్లు షేర్‌ 155.20 కోట్ల గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్ చెబుతున్నాయి. ఇక 8 కోట్లు వస్తే కానీ సేఫ్ జోన్ లోకి రాదు. ప్రస్తుతం అవి రావడం కష్టమే అనిపిస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All