Homeటాప్ స్టోరీస్ఆర‌వ రోజే పెళ్లంటూ ప్ర‌పోజ్ చేశాడ‌ట‌!

ఆర‌వ రోజే పెళ్లంటూ ప్ర‌పోజ్ చేశాడ‌ట‌!

ఆర‌వ రోజే పెళ్లంటూ ప్ర‌పోజ్ చేశాడ‌ట‌!
ఆర‌వ రోజే పెళ్లంటూ ప్ర‌పోజ్ చేశాడ‌ట‌!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది మెహ‌రీన్‌. ఆ త‌రువాత క‌మ‌ర్షియ‌ల్ క‌థానాయిక‌గా ప‌లు చిత్రాల్లో న‌టించినా అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన `ఎఫ్‌2` మెహ‌రీన్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. హ‌నీ ఈజ్ ద బెస్ట్ అంటూ డిఫ‌రెంట్ మేన‌రిజ‌మ్‌తో న‌వ్వులు పూయించి ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం `ఎఫ్‌3`లో న‌టిస్తోంది.

హ‌ర్యానాకు చెందిన యువ లీడ‌ర్ భ‌వ్య బిష్ణోయ్‌ని త్వ‌ర‌లో పెళ్లిచేసుకోబోతోంది. ఇటీవ‌లే హ‌ర్య‌నాలోని ఓ కోట‌లో వీరి నిశ్చితార్థం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మెహ‌రీన్ త‌న‌కు కాబోయే భ‌ర్త గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. భ‌వ్య బిష్ణోయ్ ప‌రిచ‌యం అయి కేవ‌లం ప‌ది నెల‌లే అయినా జీవిత కాలం అత‌నితో అనుబంధం వున్న‌ట్టుగా త‌న‌కు అనిపించింద‌ని చెబుతోంది.

- Advertisement -

త‌ను ప‌రిచ‌య‌మైన ఆర‌వ రోజే పెళ్లి చేసుకోవాల‌ని వుంద‌ని చెప్పేశాడ‌ట భ‌వ్య బిష్ణోయ్‌. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని, అప్ప‌టి నుంచి ఫోన్‌లు, చాటింగ్‌లు, మెసేజ్‌లు చేసుకుంటున్నామ‌ని,  ఒక‌రోజు ఫోన్ చేసి త‌న‌ని పెళ్లి చేసుకోవాల‌ని వుంద‌ని చెప్పేశాడ‌ని, బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ కోసం అండ‌మాన్ వెళితే అక్క‌డ స్కూబా డైవింగ్ చేస్తూ `విల్ యు మ్యారీ మీ` అనే ప్లా కార్డ్‌తో భ‌వ్య త‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేశాడ‌ని, వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాన‌ని వెల్ల‌డించింది మెహ‌రీన్‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All