Homeటాప్ స్టోరీస్క‌రోనాకు తొలి వ్యాక్సిన్ హైద‌రాబాద్ నుంచే!

క‌రోనాకు తొలి వ్యాక్సిన్ హైద‌రాబాద్ నుంచే!

క‌రోనాకు తొలి వ్యాక్సిన్ హైద‌రాబాద్ నుంచే!
క‌రోనాకు తొలి వ్యాక్సిన్ హైద‌రాబాద్ నుంచే!

క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకీ ప్ర‌మాద స్థాయికి చేరుకుంటున్న వేళ దానికి వ్యాక్సిన్‌ని హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ సంస్థ రూపొందించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. భార‌త్ బ‌యోటెక్ సంస్థ `కో వ్యాక్సిన్` పేరుతో ఈ వ్యాక్సిన్‌ని త‌యారు చేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. దీన్ని జూలైలో మనుషుల‌పై ప్ర‌యోగాత్మ‌కంగా ప్ర‌యోగించ‌నున్నార‌ట‌.

హైద‌రాబాద్‌లోని జెనోమ్ వ్యాలీ‌కి చెందిన భార‌త్ బ‌యోటెక్ సంస్థ ఐసీఎంఆర్‌, పుణేలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ సంస్థ‌తో క‌లిసి ఈ వ్యాక్సిన్‌ని రూపొందించింద‌ని తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి‌సై సోష‌ల్ మీడియా వేదికగా ఆ సంస్థ‌ని అభినందించింది. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మీ కృషి అభినంద‌నీయ‌మ‌ని ప్ర‌శంసించారు.

- Advertisement -

ఈ విష‌మ ప‌రిస్థితుల్లో వ్యాక్సిన్ రూపొందించ‌డం గ‌‌ర్వంగా వుంద‌ని భార‌త్ బ‌యోటెక్ సంస్థ సీఎండీ కృష్ణా ఎల్లా తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఈ వ్యాక్సిన్‌ని జంతువుల‌పై ప్ర‌యోగించామ‌ని, అవి క్షేమంగా వున్నాయ‌ని, వాటి రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరిగింద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వెల్ల‌డించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All