సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం మొదటి వారాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకుంది . మొదటి రోజు నుండే హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం మొదటి వారంలో 150 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . ఓవర్ సీస్ లో సైతం మహేష్ మంచి వసూళ్ల ని సాధిస్తున్నాడు . మహేష్ కు ఓవర్ సీస్ లో మంచి మార్కెట్ ఉంది దాంతో భరత్ అనే నేను మూడు మిలియన్ డాలర్ల ని కొట్టేసింది .
ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ వసూళ్ల ని సాధిస్తున్నాడు మహేష్ . రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా చెప్పుకోతగ్గ రీతిలో వసూళ్లు వస్తున్నాయి . 7 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించినట్లు ఉమైర్ సందు ట్వీట్ చేసాడు . మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది భరత్ అనే నేను . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ సరసన కియారా అద్వానీ నటించగా దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . మహేష్ ని ముఖ్యమంత్రి పాత్రలో చూసి అభిమానులు పరవశించిపోతున్నారు . మరే సినిమా పోటీ లేకపోవడంతో మరో వారం రోజుల పాటు మహేష్ చిత్రానికి పోటీ లేకుండా పోయింది .