మాజీ హీరోయిన్ భానుప్రియ మాజీ భర్త గుండెపోటు తో చనిపోయారు , దాంతో హుటా హుటిన అమెరికా బయలుదేరింది భానుప్రియ . 90 వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది భానుప్రియ . తెలుగు , తమిళ చిత్రాల్లో నటించిన భానుప్రియ 1998 లో ఆదర్శ్ కౌశల్ ని పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడింది . భానుప్రియ – ఆదర్శ్ కౌశల్ కు ఒక కూతురు కూడా . అయితే పెళ్ళైన ఏడేళ్ల కే ఇద్దరి మధ్య కలతలు చెలరేగడంతో ఇక అతడితో ఉండలేమని విడాకులు ఇచ్చింది 2005 లో . ఆదర్శ్ కు విడాకులు ఇచ్చాక చెన్నై కి వచ్చేసింది భానుప్రియ .
అయితే మాజీ భర్త చనిపోయాడని భానుప్రియ కు తెలియడంతో వెంటనే అమెరికా పయనమయ్యింది . అక్కడ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక మళ్ళీ ఇండియాకు తిరిగి రానుంది భానుప్రియ . భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ బిజీ గానే ఉంది భానుప్రియ .