
సంగీతం : థమన్
నిర్మాతలు : వంశీ – ప్రమోద్
దర్శకత్వం : అశోక్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 26 జనవరి 2018
అరుంధతి చిత్రంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది అనుష్క . బాహుబలి తో ఒక్కసారిగా లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని సైతం సొంతం చేసుకుంది . తాజాగా యువి క్రియేషన్స్ పతాకంపై అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భాగమతి . ఈరోజు రిలీజ్ అయిన భాగమతి ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .
కథ :
సెంట్రల్ మినిష్టర్ ఈశ్వర్ ప్రసాద్ (జయరామ్ ) దగ్గర సెక్రటరీ గా పనిచేస్తుంది చెంచల ( అనుష్క ). అయితే అనూహ్యంగా చెంచల తన ప్రియుడి ని చంపేస్తుంది . దాంతో పోలీసులు ఆమెని అరెస్ట్ చేస్తారు . అదే సమయంలో చెంచల ని విచారించడానికి అడవిలో ఉన్న భాగమతి బంగ్లా కు తరలిస్తారు . అక్కడ భాగమతి చంచల శరీరాన్ని ఆవహిస్తుంది దాంతో కథ మరో మలుపు తిరుగుతుంది . అసలు చంచల తన ప్రియుడిని ఎందుకు చంపింది ? భాగమతి చంచల శరీరంలో ఎందుకు ఆవహించింది ? ఇత్యాది విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
హైలెట్స్ :
అనుష్క నటవిశ్వరూపం
సెకండాఫ్
రీ రికార్డింగ్
డ్రా బ్యాక్స్ :
కొన్ని అనవసర సన్నివేశాలు
నటీనటుల ప్రతిభ :
ఈ సినిమాకు అనుష్క నటన హైలెట్ గా నిలిచింది . భాగమతి పాత్రలో నటించిన అనుష్క ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించింది ,భాగమతి పాత్రలో విభిన్నత చూపించింది ……. అలాగే చంచల పాత్రలో హుందాగా నటించి రెండు పాత్రల్లో వేరియేషన్స్ చూపించింది . జయరాం , ఉన్ని ముకుందన్ ,ఆశా శరత్ , మురళీశర్మ ,ధన్ రాజ్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు . అయితే ఎంతమంది ఉన్న వన్ విమెన్ షోగా మారింది భాగమతి .
సాంకేతిక వర్గం :
మది సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలెట్ కాగా అదే స్థాయిలో థమన్ రీ రికార్డింగ్ కూడా బాగా హెల్ప్ అయ్యింది . యువి నిర్మాణ విలువలు బాగున్నాయి , ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర భాగమతి సెట్ మరో ఆకర్షణ ఈ చిత్రానికి ఇక దర్శకుడు అశోక్ విషయానికి వస్తే ….. అనుష్క ని ఏ రకంగా చూపిస్తే బాగుంటుందో బాగా ఒంట బట్టించుకొని చేసిన ప్రయత్నమే ఈ భాగమతి . ఇంటర్వెల్ బ్యాంగ్ తో ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్ పై ఆసక్తి ని రేకెత్తించాడు అలాగే భాగమతి పాత్రని తీర్చి దిద్దిన తీరు అమోఘమే !
ఓవరాల్ గా :
తప్పకుండా చూడాల్సిన సినిమా
- Advertisement -