
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు మాస్ హీరోగా టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్‌తో పాటు క్రేజ్ కూడా ఏర్పడింది. అంతకు మించి హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన చిత్రాలకు హిందీ డబ్బింగ్ మార్కెట్‌లో మంచి క్రేజ్ వుంది. తను నటించిన చిత్రాలు డబ్ అయి నార్త్ ఇండియాలో సూపర్ హిట్‌లుగా నిలిచాయి.
బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన `జయ జానకి నాయక`చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ చిత్రం రికార్డ్ స్థాయి వ్యూస్ ని సాధించింది. ఆ తరువాత తేజ దర్శకత్వంలో వచ్చిన `సీత` చిత్రాన్ని కూడా అలాగే యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే 170 మిలియన్ వ్యూస్ సాధించి ఆశ్చర్యపరిచింది. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాల హిందీ డబ్బింగ్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.
ఈ విషయాన్ని గమనించిన ఓ హిందీ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్‌ని బాలీవుడ్ కు పరిచయం చేయాలనుకుంటున్నారట. ఇందుకు ప్రభాస్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ఛత్రపతి`ని బెల్లంకొండ శ్రీనివాస్‌తో రీమేక్ చేయాలనుకుంటున్నాడని తెలిసింది. ఇప్పటికే ఈ డీల్‌ని బెల్లంకొండకు చెప్పారట. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ `అల్లుడు అదుర్స్ ` చిత్రంలో నటిస్తున్నారు.