Homeగాసిప్స్బెల్లం కొండ శ్రీనివాస్ తో భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ మూవీ..?

బెల్లం కొండ శ్రీనివాస్ తో భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ మూవీ..?

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ బ్యానర్ నుండి వచ్చిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చిపెడుతుంది. ఈ ఏడాది డీజే టిల్లు , భీమ్లా నాయక్ మూవీస్ తో వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న సినిమాలే కాక మరికొన్ని ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ భారీ చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఈ చిత్రాన్ని ఓ అగ్ర దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నారని , ఈ మూవీ లో కాస్ట్ & క్రూ కూడా భారీగా ఉండబోతుందని అంటున్నారు. అతి త్వరలోనే ఈ వివరాలన్నీ అధికారిక ప్రకటన చేయనున్నారట. మరి ఆ డైరెక్టర్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ..తెలుగు లో సూపర్ హిట్ అయినా ఛత్రపతి చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేస్తున్నాడు. వివి వినాయక్ డైరెక్ట్ చేస్తుండగా, పెన్ స్టూడియో సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయబోతారని అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All