Homeటాప్ స్టోరీస్బెల్లంకొండ బాలీవుడ్ డెబ్యూ షూటింగ్ షురూ

బెల్లంకొండ బాలీవుడ్ డెబ్యూ షూటింగ్ షురూ

బెల్లంకొండ బాలీవుడ్ డెబ్యూ షూటింగ్ షురూ
బెల్లంకొండ బాలీవుడ్ డెబ్యూ షూటింగ్ షురూ

రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న విషయం తెల్సిందే. 2004లో విడుదలై ఐకానిక్ హిట్ గా నిలిచిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. వివి వినాయక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా పెన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.

ఈ శుక్రవారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. హైదరాబాద్ శివార్లలో ఇప్పటికే భారీ సెట్ ను వేశారు. భారీ ఖాళి స్థలంలో వేసిన విలేజ్ సెట్ లో ఈ సినిమా చిత్రీకరణ సాగుతుంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

శుక్రవారం రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే రోజున గ్రాండ్ గా చిత్రాన్ని లాంచ్ చేస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం బెల్లంకొండ కెరీర్ ను ఏ విధంగా టర్న్ తిప్పుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All