Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్ఛత్రపతి రీమేక్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న బెల్లంకొండ

ఛత్రపతి రీమేక్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న బెల్లంకొండ

ఛత్రపతి రీమేక్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న బెల్లంకొండఛత్రపతి రీమేక్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న బెల్లంకొండ
ఛత్రపతి రీమేక్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న బెల్లంకొండ

తెలుగులో కేవలం ఆరేడు సినిమాలు మాత్రమే చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ కు అనుకోకుండా బాలీవుడ్ నుండి పిలుపొచ్చింది. తెలుగులో సెన్సేషన్ సాధించిన ఛత్రపతి చిత్రాన్ని ప్రస్తుతం హిందీలో రీమేక్ చేయనున్నారు. తన డబ్బింగ్ సినిమాలతో క్రేజ్ ను సంపాదించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతున్నాడు.

- Advertisement -

ప్రస్తుతం ఈ హీరో తెలుగులో అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉంటే ఛత్రపతి రీమేక్ పై, తన బాలీవుడ్ ఎంట్రీపై స్పందించాడు బెల్లంకొండ బాబు.

“ప్రభాస్ పాత్రలో నటించడానికి నేనేం నెర్వస్ గా ఫీల్ అవ్వట్లేదు. అసలు బాలీవుడ్ డెబ్యూ గురించే టెన్షన్ తీసుకోవట్లేదు. పైగా నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నా 7 సినిమాల్లో 6 చిత్రాలు హిందీలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 200 మిలియన్ వ్యూస్ పైన ఈ చిత్రాలన్నీ సాధించాయి. ఈ రకంగా మార్కెట్ రావడాన్ని నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా” అని అంటున్నాడు శ్రీనివాస్.

ఇక తనను హీరోగా లాంచ్ చేసిన వినాయక్ ఇప్పుడు హిందీలో కూడా లాంచ్ చేస్తుండడం చాలా లక్కీ అంటున్నాడు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts