
ఆరంభంలోనే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ డ్రీమ్‌కు బ్రేక్ పడిందా? అంటే తాజా పరిణామాలని బట్టి చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ `ఛత్రపతి` రీమేక్‌తో బాలీవుడ్ లోకి అరంగేట్రం చేయబోతున్నారంటూ గత రెండు నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. డా. జయంతిలాల్‌గడ పెన్ స్టూడియోస్ బ్యానర్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నామంటూ వెల్లడించారు.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌లో రెగ్యులర్ ప్రారంభించాల్సి ఉంది కానీ ఇప్పుడు అది కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. `ఛత్రపతి` స్క్రిప్ట్‌ని బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా వినాయక్ హిందీ రచయితల సహాయంతో పూర్తిగా మార్చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే కరోనా కారణంగా ఈ చిత్రాన్ని నిలిపివేయలేదనిఅనేక ఇతర సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టారని తెలిసింది. అంతే కాకుండా ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కోసం తమిళ హిట్ ‘కర్ణన్’ రీమేక్ హక్కుల్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ముందు ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాతే `ఛత్రపతి` రీమేక్ గురించి ఆలోచించాలని బెల్లంకొండ శ్రీనివాస్, బెల్లంకొండ సురేష్ భావిస్తున్నారట. ఆ కారణంగానే `ఛత్రపతి` రీమేక్‌కు బ్రేక్ పడిందని తెలిసింది.