Homeటాప్ స్టోరీస్హరికృష్ణ ఆవేశంతోనే బాబు అధికారంలోకి

హరికృష్ణ ఆవేశంతోనే బాబు అధికారంలోకి

behind the reason of chandrababu political power1995 ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా అధికార పీఠాన్ని అధిరోహించడానికి హరికృష్ణ ఆవేశమే కారణం . లక్ష్మీపార్వతి ని అడ్డుపెట్టుకొని తన రాజకీయ చతురత తో పద్మవ్యూహాన్ని పన్నాడు చంద్రబాబు , కాగా హరికృష్ణ ఆవేశాన్ని క్యాష్ చేసుకొని ఆగస్టు సంక్షోభాన్ని సృష్టించాడు దాంతో తెలుగుదేశం పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోగా ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడిని చేసి వెన్నుపోటు రాజకీయాలతో అధికారాన్ని అందుకున్నాడు చంద్రబాబు . మొదట లక్ష్మీపార్వతి తో ఎన్టీఆర్ పెళ్లి ని పూర్తిగా వ్యతిరేకించింది హరికృష్ణే ! దాంతో అతడ్ని ఆయుధంగా మలుచుకొని ఎన్టీఆర్ ని గద్దె దించిన మోసకారి చంద్రబాబు .

ఎన్టీఆర్ ని పడగొట్టడానికి హరికృష్ణ తో పాటుగా బాలయ్య ని తనవైపుకు తిప్పుకోవడం వల్లే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంతేకాని పూర్తిగా అతడి సామర్ధ్యం వల్లనే కాదు . అధికారం కోసం గుంటనక్క లా వేచి చూస్తున్న సమయంలో హరికృష్ణ ఆవేశం చంద్రబాబు కు కలిసి వచ్చింది అంతే ! దాన్ని అందిపుచ్చుకొని తన కపట నాటకానికి శ్రీకారం చుట్టాడు దాంతో ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడిని చేయడంలో విజయం సాధించాడు . ముఖ్యమంత్రి అయ్యాక హరికృష్ణ ని రవాణా శాఖా మంత్రిగా నియమించాడు కానీ సకాలంలో ఉప ఎన్నిక రాకపోవడంతో ఆత్మాభిమానం నిండుగా ఉన్న హరికృష్ణ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసాడు , అయినా అప్పటికే మేకవన్నె పులి లాంటి బాబు నిజస్వరూపం ఏంటో హరికృష్ణ కు తెలిసొచ్చింది కాబట్టే అప్పటి నుండి చంద్రబాబు కి , తెలుగుదేశం పార్టీ కి దూరంగా ఉంటూ వచ్చాడు .

- Advertisement -

English Title: behind the reason of chandrababu political power

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All