బెంగాలీ సీనియర్ నటుడు చిన్మయ్ రాయ్ గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . చిన్మయ్ రాయ్ కి గాయాలయ్యాయని తెలియడంతో బెంగాలీ చిత్ర పరిశ్రమ షాక్ కి గురయ్యింది . బెంగాలీ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు చిన్మయ్ రాయ్ . సౌత్ కోల్ కతా లోని అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నాడు చిన్మయ్ రాయ్ , కాగా నాలుగో అంతస్థు నుండి కిందపడిపోవడంతో చిన్మయ్ రాయ్ కి తీవ్ర గాయాలయ్యాయి . అయితే చిన్మయ్ రాయ్ కిందపడిన సమయంలో అతడి కొడుకు లేకపోవడంతో కాస్త ఆలస్యంగా ఆసుపత్రికి తరలించారు అపార్ట్ మెంట్ వాసులు .
ప్రస్తుతం కోల్ కతా లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు చిన్మయ్ రాయ్ , ఆరోగ్యం నిలకడగా ఉందని ……. ప్రాణానికి ప్రమాదం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి . చిన్మయ్ రాయ్ కోలుకుంటుండటంతో అతడి కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు . బెంగాలీ లో విభిన్నతరహా నటుడిగా పేరుగాంచారు చిన్మయ్ రాయ్ . ప్రాణాపాయం నుండి బయట పడటంతో అతడ్ని పలువురు బెంగాలీ సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు .