Homeటాప్ స్టోరీస్బ్యూటిఫుల్ మూవీ రివ్యూ

బ్యూటిఫుల్ మూవీ రివ్యూ

Beautiful Movie Review Telugu
Beautiful Movie Review Telugu

నటీనటులు: నైనా గంగూలి, సూరి
దర్శకత్వం: అగస్త్య మంజు
నిర్మాత‌లు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్
సంగీతం: రవి శంకర్
రేటింగ్: 1.75/5

రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో బాగా హడావిడి చేసిన చిత్రం బ్యూటిఫుల్. గత కొంత కాలంగా ఇంటర్వ్యూలలో, ప్రమోషనల్ కార్యక్రమాలలో వర్మ డ్యాన్స్ లు అవీ వేసి తెగ హంగామా చేసాడు. రంగీలాకు ట్రిబ్యూట్ అంటూ బ్యూటిఫుల్ చిత్రాన్ని నిర్మించాడు. అగస్త్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటినుండి అంచనాలను పెంచడంలో విఫలమైంది. అయితే వర్మ హంగామా చేసిన రేంజ్ లో ఈ చిత్రం ఉందో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ:
రిని (నైనా గంగూలీ), మయాంక్ (సూరి) ధారావి లోని స్లమ్ లో నివసిస్తుంటారు. ఈ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. అయితే అనుకోకుండా రినికి సినిమాల్లో అవకాశాలు వచ్చి హీరోయిన్ గా ఎదుగుతుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి. ఇగో సమస్యలు చుట్టుముడతాయి. చివరికి వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నది మిగిలిన కథ.

- Advertisement -

నటీనటులు:
సూరి ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో తన నటనకు మంచి మార్కులు పడతాయి. నైనా గంగూలీతో కెమిస్ట్రీ విషయంలోనూ మెప్పించాడు. మొత్తానికి సూరికి ఇది మంచి లాంచ్ అని చెప్పవచ్చు. నైనా గంగూలీ నటన గురించి చెప్పుకోవడానికేం లేదు. ఓవర్ యాక్షన్ చేసింది. అయితే ఆమె గ్లామర్ విందు మాత్రం బాగా చేసింది. సినిమా ఆద్యంతం ఆమె గ్లామర్ ను బాగా వాడుకున్నారు. మిగిలిన వాళ్ళ గురించి చెప్పుకోవడానికేం లేదు.

సాంకేతిక నిపుణులు:
ఆర్ట్ డైరెక్షన్ బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. పాటల్లో సత్తువ లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొంత మేర మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలను అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ అస్తవ్యస్తంగా ఉంది. ఫస్ట్ హాఫ్ లోనే ఐదు పాటలు వచ్చి విసిగిస్తాయి. దర్శకుడు అగస్త్య టోటల్ గా ఫెయిల్ అయ్యాడు. నరేషన్ లో ఏమంత స్పెషలిటీ లేదు. అసలు సంబంధం లేకుండా వచ్చే సీన్లతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పక్కా.

చివరిగా: కేవలం నైనా గంగూలీ అందాలు తప్పితే ఇందులో చెప్పుకోవడానికి ఏ ప్రత్యేకతా లేదు. దానికోసమే థియేటర్ కు వెళ్ళాలా అంటే అది మీ ఇష్టం.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All