
విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ మూవీ ట్రైలర్ ఉగాది సందర్భాంగా శనివారం విడుదలై యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది. తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘బీస్ట్’. ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఏప్రిల్ 13 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లలో భాగంగా చిత్ర ట్రైలర్ ను నిన్న ఉగాది సందర్బంగా విడుదల చేయగా ..యూట్యూబ్ లో సంచలన వ్యూస్ రాబడుతూ పలు రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ప్రస్తుతం ట్రైలర్ విడుదలై 24 గంటలు గడవక ముందే 25 మిలియన్ వ్యూస్ రాబట్టి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
