
తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘బీస్ట్’. ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా సెన్సార్ రీసెంట్ గా పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ దక్కించుకుంది.
ఇదిలా ఉంటె విజయ్ ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియెన్స్ ఆసక్తి గా ఎదురుచూస్తున్న ట్రైలర్ అప్డేట్ ను చిత్ర యూనిట్ పంచుకున్నారు. ట్రైలర్ ను చూసేందుకు ఎంతో ఈగర్‌గా ఉన్నారని.. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రైలర్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. బీస్ట్ థియేట్రికల్ ట్రైలర్‌ను ఏప్రిల్ 2న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని అరబిక్ సాంగ్ వరల్డ్ వైడ్ గా ఎంతో పాపులర్ అయ్యింది.