Homeన్యూస్బీస్ట్ మరో నలభై రోజుల్లో పూర్తి చేసేస్తాడట

బీస్ట్ మరో నలభై రోజుల్లో పూర్తి చేసేస్తాడట

బీస్ట్ మరో నలభై రోజుల్లో పూర్తి చేసేస్తాడట
బీస్ట్ మరో నలభై రోజుల్లో పూర్తి చేసేస్తాడట

తమిళ టాప్ హీరో విజయ్ ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. వరసగా సూపర్ హిట్ చిత్రాలను విడుదల చేసిన విజయ్ ప్రస్తుతం చేస్తోన్న సినిమా బీస్ట్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం బీస్ట్ షూటింగ్ ఇప్పటికే మెజారిటీ పార్ట్ పూర్తయిందని తెలుస్తోంది. మరో 40 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందిట. డిసెంబర్ కల్లా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ కు సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. క్లైమాక్స్ కోసం భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. విజయ్ సరసన పూజ హెగ్డే తొలిసారి నటిస్తోన్న ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. నెల్సన్ దర్శకత్వంలో రీసెంట్ గా వచ్చిన డాక్టర్ మంచి విజయం సాధించింది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలో హయ్యస్ట్ గ్రాస్ కలెక్షన్ సాధించిన చిత్రంగా డాక్టర్ నిలిచింది. శివ కార్తికేయన్ ఈ చిత్రంలో లీడ్ రోల్ లో చేసాడు.

- Advertisement -

డాక్టర్ సూపర్ హిట్ కావడంతో బీస్ట్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సెల్వరాఘవన్, యోగిబాబు ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. బీస్ట్ కు సంబంధించి మరింత సమాచారం త్వరలోనే రివీల్ కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All