Homeటాప్ స్టోరీస్విజయ్ బీస్ట్ నాల్గు రోజుల కలెక్షన్స్

విజయ్ బీస్ట్ నాల్గు రోజుల కలెక్షన్స్

Vijay Beast collections
Vijay Beast collections
Vijay Beast collections
Vijay Beast collections

నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ నటించిన చిత్రం ‘బీస్ట్’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. సెల్వ రాఘవన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 13 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుండడం విశేషం.

- Advertisement -

చెన్నైలో ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 5 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. మూడో రోజున 1.41 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం నాలుగో రోజున 1 కోటి రూపాయలపైగానే వరకు రాబట్టింది. దాంతో చెన్నైలో 6 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్ల ద్వారా 654,620 డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం తొలి రోజున 144,909 డాలర్లు, రెండో రోజున 101,381 డాలర్లు, మూడో రోజున 153,244 అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. ఇక నాలుగో రోజున అంటే శనివారం 135000 అమెరికన్ డాలర్లను వసూలు చేసినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో బీస్ట్ మూవీ మూడు రోజుల్లో 11.55 కోట్ల గ్రాస్, 6.58 కోట్ల షేర్ సాధించింది. నాలుగో రోజు 40 లక్షల రూపాయలను వసూలు చేసింది. దాంతో 12 కోట్ల గ్రాస్ వద్ద ఈ సినిమా నిలిచింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All