Homeటాప్ స్టోరీస్బిగ్‌బాస్ ఫైన‌ల్‌కు మ‌ళ్లీ వ‌స్తున్న మెగాస్టార్‌!

బిగ్‌బాస్ ఫైన‌ల్‌కు మ‌ళ్లీ వ‌స్తున్న మెగాస్టార్‌!

బిగ్‌బాస్ ఫైన‌ల్‌కు మ‌ళ్లీ వ‌స్తున్న మెగాస్టార్‌!
బిగ్‌బాస్ ఫైన‌ల్‌కు మ‌ళ్లీ వ‌స్తున్న మెగాస్టార్‌!

బిగ్‌బాస్ సీజ‌న్ 4 గ్రాండ్ ఫినాలే స్టేజ్‌కి చేరిపోయింది. మ‌రో మూడు రోజులే వుండ‌టంతో ఇంటి స‌భ్యుల్లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం మొద‌లైంది. ప్ర‌స్తుతం హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ వున్నారు. ఈ టాప్ 5లో విజేత‌గా నిలిచేది ఎవ‌రు?  బిగ్‌బాస్ టైటిల్‌తో పాటు 50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీని గెలిచేది ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ శ‌నివారంలో బిగ్‌బాస్ పూర్తి కాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం అంటే ఈ నెల 20న ఫైన‌ల్‌కి సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది.

ఇందు కోసం భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రాండ్ ఫినాలే కు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజ‌రు  కాబోతున్నార‌ని తెలిసింది. గ‌త సీజ‌న్ 3కి కూడా చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజ‌రై ఫైన‌ల్ విజేత‌కు ట్రోఫీని అందించారు. అదే త‌ర‌హాలో సీజన్ 4కి కూడా ఆయ‌నే చీఫ్ గెస్ట్‌గా వ‌స్తుండ‌టంతో బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ప్ర‌ధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

- Advertisement -

గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ కోసం ప‌లువురు స్టార్ ల‌ని ప‌రిశీలించిన బిగ్‌బాస్ నిర్వాహ‌కులు చివ‌రికి మెగాస్టార్‌నే మ‌ళ్లీ చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. ఇటీవ‌లే ఆయ‌న‌ని సంప్ర‌దించార‌ని, చిరు కూడా సుముఖంగా స్పందించార‌ని తెలిసింది. ఫైన‌ల్ టైటిల్ విష‌యంలో ఐదుగురు స‌భ్యులు అభిజీత్‌, సోహైల్‌, అఖిల్, హారిక‌, అరియానా పోటీప‌డుతున్నా ప్ర‌ధానంగా మాత్రం అభిజీత్, సోహైల్‌ల మ‌ధ్య ప్ర‌ధాన పోటీ నెల‌కొంద‌ని తెలుస్తోంది. ఈ ఇద్ద‌రిలో అభిజీత్ టైటిల్ ఫేవ‌రేట్ అని ఇప్ప‌టికే ఫీల‌ర్స్ వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All