
ప్రముఖ గాయకుడు , స్వరకర్త బప్పీలహరి కన్నుమూసిన సంగతి తెలిసిందే. పలు అనారోగ్య సమస్యలతో ముంబైలోని జుహూలోని క్రిటికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈయన మరణ వార్త తెలిసి యావత్ సినీ లోకం విచారం వ్యక్తం చేస్తూ.. బప్పీలహరి తో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. తెలుగులోనూ పలు సినిమాలకు మ్యూజిక్ అందించడం తో ఆయా స్టార్స్ బప్పీలహరి మరణం పట్ల స్పందిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి , మోహన్ బాబు వంటి వారు విచారణ వ్యక్తం చేసారు.
ఇదిలా ఉంటె బప్పీలహరి అంత్యక్రియలు ఈరోజు జరగడం లేదని తెలుస్తుంది.ఆయన కుమారుడు విదేశాల్లో ఉండడం తో అతడు వచ్చాకే అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అయితే బప్పీలహరి అంత్యక్రియలు రేపు జరగవచ్చని చెపుతున్నారు. 1952న నవంబర్ 27 పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన బప్పి లహిరి దాదాపు 500కు పైగా సినిమాల్లో 5000 పాటలకు సంగీతం అందించారు.
బప్పి లహిరి 1970-80 చివర్లో చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబి వంటి అనేక చిత్రాలలో సూపర్ పాటలను అందించారు. 2020లో శ్రద్దా కపూర్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బాఘీ 3లో భంకాస్ పాట చివరిగా ఆలపించారు. తెలుగులో బప్పి లహిరి సింహాసనం సినిమాకు సంగీతం అందించాడు.. ఆ తర్వాత స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు. నిత్యం బంగారు ఆభరణాలతో ఉండే సంగీత విద్వాంసుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.