Homeటాప్ స్టోరీస్సింగర్ బప్పీలహరి ఇక లేరు..

సింగర్ బప్పీలహరి ఇక లేరు..

సింగర్ బప్పీలహరి ఇక లేరు..
సింగర్ బప్పీలహరి ఇక లేరు..

ప్రముఖ గాయకుడు , స్వరకర్త బప్పీలహరి కన్నుమూశారు. బప్పి లహిరిగాప్రసిద్ధి చెందిన అలోకేష్ లాహిరి వయసు 69 ఏళ్లు. 1952 నవంబర్‌ 27న బెంగాల్‌లో బప్పీలహరి జన్మించారు. బప్పీలహరి పలు అనారోగ్య సమస్యలతో ముంబైలోని జుహూలోని క్రిటికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

బప్పి లహిరి 1970-80 చివర్లో చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబి వంటి అనేక చిత్రాలలో సూపర్ పాటలను అందించారు. 2020లో శ్రద్దా కపూర్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బాఘీ 3లో భంకాస్ పాట చివరిగా ఆలపించారు. తెలుగులో బప్పి లహిరి సింహాసనం సినిమాకు సంగీతం అందించాడు.

- Advertisement -

ఆ తర్వాత స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‏స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు. నిత్యం బంగారు ఆభరణాలతో ఉండే సంగీత విద్వాంసుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తన ప్రయాణంలో ఎన్నో హిట్ పాటలు పాడారు. ఈయన మరణ వార్త తెలుసుకొని యావత్ సంగీత ప్రేక్షకులు విచారం వ్యక్తం చేస్తూ నివాళ్లు అర్పిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All