Homeటాప్ స్టోరీస్రేపటి నుండి ఓటిటిలో మొదలుకాబోతున్న బంగార్రాజు సందడి

రేపటి నుండి ఓటిటిలో మొదలుకాబోతున్న బంగార్రాజు సందడి

రేపటి నుండి ఓటిటిలో మొదలుకాబోతున్న బంగార్రాజు సందడి
రేపటి నుండి ఓటిటిలో మొదలుకాబోతున్న బంగార్రాజు సందడి

నాగార్జున , నాగచైతన్య , రమ్యకృష్ణ , కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచి , మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ రేపటి నుండి (ఫిబ్రవరి 18 ) ZEE5 లో స్ట్రీమింగ్ కాబోతుంది. 2016 లో విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ తెరకెక్కింది.

బంగార్రాజు రిలీజ్ సమయంలో ఏపీలో కరోనా నిబంధనలు ఉన్నా.. నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా.. టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటికీ అధిగమించి బంగార్రాజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపాడు.

- Advertisement -

పైగా చాలా యేళ్ల తర్వాత  ఒకే స్క్రీన్ పై తండ్రి కొడుకులైన నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది. అంతే కాకుండా ఉప్పెన తో ఓ ఊపుఊపేసిన కృతి శెట్టి హీరోయిన్ గా నటించడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. మరి థియేటర్స్ లలో మంచి వసూళ్లు రాబట్టిన ఈ మూవీ..రేపటి నుండి ZEE5 లో ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All