Homeటాప్ స్టోరీస్బండ్ల గణేష్ హీరోగా పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్

బండ్ల గణేష్ హీరోగా పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్

బండ్ల గణేష్ హీరోగా పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్
బండ్ల గణేష్ హీరోగా పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్

నటుడు, కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. తమిళంలో కల్ట్ స్టేటస్ అందుకున్న ఒత్త సెరుప్పు సైజ్ 7 చిత్రానికి అధికారికంగా రీమేక్ గా బండ్ల గణేష్ హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. దీంతో పాటు టైటిల్ ను కూడా అధికారికంగా విడుదల చేసారు.

బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ చిత్రానికి డేగల బాబ్జి అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇక ఫస్ట్ లుక్ లో కనుబొమ్మ పైన కుట్లతో బండ్ల గణేష్ ఫస్ట్ లుక్ కూడా ఆసక్తికరంగా, కొత్తగా ఉంది. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వెంకట్ చంద్ర ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

- Advertisement -

ఇక ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ అవుతోంది. అక్కడ బండ్ల గణేష్ పోషిస్తున్న పాత్రను అభిషేక్ బచ్చన్ చేస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All