
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల హడావిడి రోజురోజుకూ పెరుగుతోంది. అక్టోబర్ 10న ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రస్తుతం ప్రచారాలతో ఇరు వర్గాలు హోరెత్తిస్తున్నారు. ఈసారి మా పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతున్నారు. ఇరు ప్యానెల్స్ సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ ఈ మా ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ కూడా వేసాడు.
తన గెలుపు ఖాయమని, తనకు చాలా సపోర్ట్ ఉందని, ‘మా’ మార్పు కోసం, ప్రగతి కోసం తాను కృషి చేస్తానని బండ్ల గణేష్ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకుంటూ వచ్చాడు. తీరా ఇప్పుడు చూస్తే, బండ్ల గణేష్ తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కలిసి బండ్ల గణేష్ ను పర్సనల్ గా రిక్వెస్ట్ చేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
“నా దైవ సామానులు.. నా ఆత్మీయులు… నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను ‘మా’ జనరల్ సెక్రటరీ నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నా” అని బండ్ల గణేష్ ట్విట్టర్ లో ప్రకటించారు.
‘మా’ ఎన్నికలు: పోటీ నుంచి తప్పుకున్న బండ్ల గణేశ్….
తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాగు కోసం ప్రాణ త్యాగం అయిన చేస్త :-@BandlaTrends @ganeshbandla
#bandlaganesh #MaaElections2021 pic.twitter.com/5HVrUwP8eu
— Bandla Ganesh Trends (@BandlaTrends) October 1, 2021