
టాలీవుడ్ ప్రొడ్యూసర్ కామ్ నటుడు బండ్ల గణేష్ కు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఒక ట్వీట్..ఒక ట్వీట్ తో మొదలైన ట్వీట్స్ వార్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. తెలుగుదేశం పార్టీ కమ్మకులం పార్టీ.. కమ్మ కులం వారు ద్రోహులు అనే విధంగా విజయసాయిరెడ్డి కొద్దికాలంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కమ్మకులం వారిని ద్వేషించడం సరికాదు.. మీకు రాజకీయపరమైన విభేదాలు ఉంటే చంద్రబాబు, లోకేష్‌ను టార్గెట్ చేయండి.. వారిని జైల్లో పెట్టించండి అంటూ బండ్ల గణేష్ ఘాటుగా స్పందిస్తూ పలు ట్వీట్స్ చేసాడు.
గణేష్ ట్వీట్స్ కు విజయ సాయి సైతం అదే రేంజ్ లో ఘాటైన ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. వక్కలు.. పక్కలు.. చరణ్, ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్‌ను చీట్ చేశావు.. హీరో సచిన్‌తో గొడవ అలాగే చెప్పు తెగేలా తన్నులు తిన్నావంటూ బండ్ల గణేష్‌పై సాయిరెడ్డి తీవ్ర ఆరోపణలలు చేశాడు. అయితే తాను ప్రభుత్వ ఆస్తులను దోచుకోలేదు.. అలాగే జైలుకు వెళ్లి రాలేదు దొంగసాయి అంటూ బండ్ల గణేష్ తన స్వరాన్ని పెంచాడు. మొత్తం మీద ఇద్దరి మధ్య వార్ నడుస్తుంది. ఈ వార్ కు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి