
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో బండ్ల గణేష్ ఒకరు. పవన్ ను దేవుడిగా కొలిచే గణేష్..పలు వేదికలపై తన అభిమానాన్ని చాటుకున్నారు. కాగా రీసెంట్ గా జరిగిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు ఈయన రాకపోయేసరికి అభిమానులు చాల బాధపడ్డారు. ఇదిలా ఉంటె తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, దానికి రిప్లైగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీలోకి రావాలని.. ఆయన పార్టీలోకి వచ్చి అధికారం తేవాలని కోరాడు. మెగాస్టార్ స్టామినా ఏమిటో చూపించాలని.. అంధకారంలో ఉన్న ఏపీ ప్రజలను ఆదుకోవాలని.. రాముడులోని సౌమ్యం చిరంజీవి అని.. లక్ష్మణుడిలోని తెగింపు పవన్ కళ్యాణ్‌ది అని.. వీరిద్దరు కలిస్తే శ్రీరామరాజ్యం అవుతుంది.. అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను జనసైనికులు, పవన్ అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ ట్వీట్ కు బండ్ల గణేష్ కూడా తనదైన స్టయిల్‌లో రిప్లై ఇచ్చాడు. ‘‘మరి నేను..?’’ అంటూ బండ్ల చేసిన కామెంట్‌కు జనసైనికులు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. గణేష్ కూడా జనసేన లోకి వచ్చేందుకు ఆసక్తి గా ఉన్నాడని మాట్లాడుకుంటున్నారు. గణేష్ నిజంగా వస్తే అభిమానులు , కార్యకర్తలు ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతారు.
మరి నేను ? https://t.co/5fvWCt4VeK
— BANDLA GANESH. (@ganeshbandla) March 30, 2022