
బాలీవుడ్‌లో డ్రగ్స్ వివాదం ఇతర ఇండస్ట్రీల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. సుశాంత్ మరణంతో ఒక్కసారిగా డ్రగ్స్ వివాదం వెలుగులోకి వచ్చింది. సుశాంత్ మరణానికి, డ్రగ్స్‌కి దగ్గరి సంబంధం వుందని ఎస్సీబీ వర్గాలు విచారణ చేపట్టారు. రియాని అరెస్ట్ చేయడంతో సెలబ్రిటీల పేర్లన్నీ ప్రస్తుతం జాతీయస్థాయిలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
ఈ కేసులో విచారణ చేస్తున్న ఎన్సీబీ అధికారులకు రకుల్ ప్రీత్‌సింగ్‌తో పాటు శ్రద్ధా కపూర్, సోహా అలీఖాన్, దీపిక పదుకునే లాంటి స్టార్స్ పేర్లని రియా బయటపెట్టినట్టు జాతీయ మీడియాలో సంచలన కథనాలు ప్రసారం అయ్యాయి. ఈవెంట్ మేనేజర్ జయ సాహా విచారణలో ఎన్ అనే అక్షరాన్ని వెల్లడించాడని, ఎన్ అంటే నమ్రత అంటూ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై నమ్రత స్పందించి తనకి డ్రగ్స్‌కి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఈ వివాదంపై నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఆసక్తికరంగా కామెంట్ చేశారు. నమ్రత నాకు 15 ఏళ్లుగా తెలుసు. చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారామె. ఆమె ఓ గ్రేట్ వైఫ్ అండ్ గ్రేట్ మదర్. అందుకే ఆమెను గౌరవిస్తాను` అని బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.