Homeటాప్ స్టోరీస్బండ్ల‌కు మ‌రోసారి ఆ అదృష్టం కావాల‌ట‌!

బండ్ల‌కు మ‌రోసారి ఆ అదృష్టం కావాల‌ట‌!

బండ్ల‌కు మ‌రోసారి ఆ అదృష్టం కావాల‌ట‌!
బండ్ల‌కు మ‌రోసారి ఆ అదృష్టం కావాల‌ట‌!

స్టార్ హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ కున్న సెల‌బ్రిటీ ఫ్యాన్స్‌లో బండ్ల గ‌ణేష్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ప‌వ‌న్ మాట ఎత్తితే చాలు బండ్ల గ‌ణేష్ పూన‌కం వ‌చ్చేస్తుంది. ముందు మైక్ వుంటే ఆయ‌న స్పీచ్‌ని ఆపాలంటే మ‌ళ్లీ ప‌వ‌న్ పూను కోవాల్సిందే. ఇక ట్విట్ట‌ర్‌లో ఆయ‌న ప‌వ‌న్‌పై చేసే ట్వీట్‌ల‌కు హ‌ద్దుండ‌దు. ప‌వ‌న్‌ని ఓ డెమిగాడ్‌గా బండ్ల పూజిస్తుంటాడు. ఎంత‌గా అంటే దేవుడి ద‌ర్శ‌నం కోసం ఎదురుచూసే అప‌ర భ‌క్తుడిలా ఆయ‌న అపాయింట్‌మెంట్ కోసం.. ఆయ‌న పిలుపు కోసం ఎదురుచూస్తుంటారు.

అలాంటి బండ్ల గ‌ణేష్ త‌న ఆరాధ్య దైవం, స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన రోజున ట్వీటేయ‌కుండా వుంటారా? అస్స‌లు వుండ‌రు. స‌రిగ్గా అదే జ‌రిగింది. గురువారం ప‌వ‌ర్‌స్టార్ పుట్టిన రోజున బండ్ల మ‌ళ్లీ త‌న‌కు ఆ అదృష్టం కావాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న కోరిక‌ని బ‌య‌ట‌పెట్టారు. ప‌వ‌న్‌తో బండ్ల గ‌ణేష్ `తీన్‌మార్‌`, గ‌బ్బ‌ర్‌సింగ్ చిత్రాలు నిర్మించారు. ఇందులో తీన్‌మార్ ఆశించిన స్థాయి విజ‌యాన్ని ద‌క్కించుకోలేక‌పోయింది. `గ‌బ్బ‌ర్‌సింగ్‌` ప‌వ‌న్ కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి ఆయ‌న కెరీర్‌ని మ‌లుపు తిప్పింది.

- Advertisement -

ఈ మూవీ త‌రువాత మ‌ళ్లీ ప‌వ‌న్‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని వుంద‌ని త‌న కోరిక‌ని బ‌య‌ట‌పెట్టారు బండ్ల గ‌ణేష్‌. `ఈశ్వర పరమేశ్వర పవన్ ఈశ్వర ఎప్పుడు నీకు మరోసారి అభిషేకం చేసే అదృష్టం అందుకో జన్మదిన శుభాకాంక్షలు` అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీటేశారు. దీంతో ఫ్యాన్స్ మీ కాంబినేష‌న్‌లో సినిమా ఎప్పుడు వుంటుందంటూ బండ్ల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించ‌డం మొద‌లుపెట్టారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All