
స్టార్ హీరో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అందులో బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. బండ్ల పవర్‌స్టార్‌కు అపర భక్తుడు. పవన్ గురించి ఏ చిన్న సందర్భంగా లభించినా బండ్ల వెంటనే రెచ్చిపోతుంటారన్నది ఫ్యాన్స్‌కే కాదు పవర్‌స్టార్ పవన్ క్యలాణ్ కు కూడా తెలుసు. `గబ్బర్‌సింగ్` ఆడియో రిలీజ్ కార్యక్రమంలో బండ్ల తన స్పీచ్‌తో పవన్‌ని విపరీతంగా నవ్వించిన విషయం తెలిసిందే.
తాజాగా అలాంటి పంచే మరోసారి పవన్‌కల్యాణ్‌పై వేశాడు బండ్ల గణేష్. పవన్‌ని తన ఇష్టదైవంగా, తన పాలిటి ఓ దేవుడిగా నిత్యం అభివర్ణించే బండ్ల గణేష్ తాజాగా పవన్‌పై చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్లని అభిమానలు ఓ కోరిక కోరారు.
పవర్‌స్టార్‌తో సినిమా ఎప్పడని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బండ్ల ఆసక్తికరంగా స్పందించారు. `నేనూ అదే ప్రయత్నాల్లో వున్నాను. ఆ దేవుడి దీవెనల కోసం ఎదురుచూస్తున్నాను` అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి తన భక్తుడు బండ్ల గణేష్‌కు పవన్ ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడో ఎలాంటి సినిమాకు శ్రీకారం చుడతాడో చూడాలి అంటున్నారు ఇండస్ట్రీ జనం.