Homeగాసిప్స్“సరిలేరు...” లో బండ్ల గణేష్ బ్లేడ్ కామెడీ .?

“సరిలేరు…” లో బండ్ల గణేష్ బ్లేడ్ కామెడీ .?

“సరిలేరు...” లో బండ్ల గణేష్  బ్లేడ్ కామెడీ .?
“సరిలేరు…” లో బండ్ల గణేష్ బ్లేడ్ కామెడీ .?

“7ఓ క్లాక్ బ్లేడ్ తీసుకురండి… గొంతు కోసుకుంటా.. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం మా గవర్నమెంట్ రాకపోతే బ్లేడ్తో కోసుకుంటా..!” అని గత ఏడాది ఈ టైం కి మనకీ షాక్ ఇచ్చిన బండ్ల గణేష్ ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు “సరిలేరు నీకేవ్వరు” లో కూడా అదే పాత్ర వేసి మళ్ళీ మనల్ని తెర మీద కూడా నవ్వించబోతున్నారా .? ఏమో అవుననే వార్తలు వస్తున్నాయి .ఈ ఫోటో కూడా అలాగే ఉంది.

డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ కి ఇండస్టీ లో మంచి పేరు ఉంది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక 37 నిమిషాల ట్రైన్ సీక్వెన్స్ ఉంటుందనీ, కథ ప్రకారం హీరోయిన్ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి హీరోను రకరకాలుగా మెప్పించే ప్రయత్నమే ఈ ట్రైన్ ఎపిసోడ్ అనీ, అందులో బండ్ల గణేష్ క్యారెక్టర్ కూడా ఉందనీ ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నాయి.

- Advertisement -

ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా ఒక వెలుగు వెలిగిన బండ్ల గణేష్ ఈ మధ్యే టైం బాగోక మరొక ప్రొడ్యూసర్ P.V.P గారితో ఆర్ధిక లావాదేవీల విషయంలో గొడవ జరిగి, జైలు కి కూడా వెళ్ళాడు. అయినప్పటికీ మహేష్ తో కాంబినేషన్ సీన్ లు ఉన్నాయనే బండ్ల ఈ క్యారెక్టర్ కి ఒప్పుకున్నాడని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అందరి క్రేజ్ ను వాడుకుని, అందులోనూ ట్రేండింగ్ లో ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో దిల్ రాజు ఎంతైనా తోపు కదా.! మరీ, సరిలేరు నీకెవ్వరు సినిమాకు బండ్ల గణేష్ బ్లేడ్ కామెడీ ప్లస్ అవుతుందో, మైనస్ అవుతుందో చూద్దాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All