Homeటాప్ స్టోరీస్బండ్ల గ‌ణేష్ మ‌ళ్లీ అడ్డంగా బుక్క‌య్యాడుగా!

బండ్ల గ‌ణేష్ మ‌ళ్లీ అడ్డంగా బుక్క‌య్యాడుగా!

బండ్ల గ‌ణేష్ మ‌ళ్లీ అడ్డంగా బుక్క‌య్యాడుగా!
బండ్ల గ‌ణేష్ మ‌ళ్లీ అడ్డంగా బుక్క‌య్యాడుగా!

న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ మ‌రోసారి అడ్డంగా బుక్క‌య్యారు. ఆ మ‌ధ్య తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌రుపున ప్ర‌చారం చేస్తూ మీడియా ముందు శ‌ప‌థాలు చేసి అడ్డంగా దొరికిపోయి చేతులెత్తేసిన విష‌యం తెలిసిందే. ఈ ద‌ఫా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం.. కావాలంటే రాసిపెట్టుకోండి.. అలా జ‌ర‌క్క‌పోతే 7`O క్లాక్‌ బ్లేడ్‌తో పీక కోయండి` అంటూ మీడియాలో కామెడీ చేసిన బండ్ల గ‌ణేష్ ఆ త‌రువాత అడ్డంగా బుక్కై సారి చెప్పిన విష‌యం తెలిసిందే.

ఫ్లోలో ఏవేవో అంటాం అవ‌న్నీ ప‌ట్టించుకుంటే ఎలా అని మాట మార్చి ఆ త‌రువాత తాను రాజ‌కీయాల్లో కొన‌సాగ‌డం లేద‌ని, త‌న‌కు బుద్ది వ‌చ్చింద‌ని, ఇక నుంచి నేను, నా సినిమాలు చూసుకుంటాన‌ని  ప్ర‌క‌టించారు కూడా. ఇదిలా వుంటే బండ్ల గ‌ణేష్ మ‌రోసారి అడ్డంగా బుక్క‌య్యారు. క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ ఊపందుకుంటున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల్ని క‌ఠిన త‌రం చేసింది. త‌ప్పని స‌రిగా మాస్కులు ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని స్ప‌ష్టం చేసింది.

- Advertisement -

అయితే చాలా మంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ మాస్కులు ధ‌రించ‌డం లేదు. దీంతో జీహెచ్ ఎంసీ అధికారులు మాస్కులు ధ‌రించ‌ని వారికి 2 వేల చొప్పున జ‌రిమ‌బాన విధిస్తున్నారు. ఇటీవ‌ల ఓ వ్య‌క్తి మాస్క్ ధ‌రించ‌ని కార‌ణంగా జీహెచ్ ఎంసీ అధికారులు 2 వేల జ‌రిమానా విధించారు. ఇందుకు సంబంధించిన రిసిప్ట్‌ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన బండ్ల గ‌ణేష్ వేర్ మాస్క్ బీ సేఫ్ అంటూ ట్వీట్ చేసి అడ్డంగా నెటిజ‌న్‌ల‌కు దొరికి పోయాడు. బండ్ల గ‌ణేష్‌కు ఇంగ్లీష్ స‌రిగా రాదు. అక్క‌డే అడ్డంగా నెటిజ‌న్‌ల‌కు దొరికి పోయారు బండ్ల. ముందు where mask , ware అని ట్విట్ చేయ‌డంతో `ఏ స్కూల్ అన్నా మ‌న‌ది అని కొంత మంది… స్కూల్స్‌కి సెల‌విస్తే చ‌దువు మ‌ర్చిపోయిన‌ట్టు ఇంగ్లీష్‌ని మ‌ర్చిపోతున్నావా అన్నా wear ని where, ware  అని టైప్ చేస్తున్నావ్‌` అని నెటిజ‌న్‌లు బండ్ల‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All