
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో బండ్ల గణేష్ ఒకరు. పవన్ ను దేవుడిగా కొలిచే గణేష్..పలు వేదికలపై తన అభిమానాన్ని చాటుకున్నారు. కాగా రీసెంట్ గా జరిగిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు ఈయన రాకపోయేసరికి అభిమానులు చాల బాధపడ్డారు. ఇప్పుడు ఆ లోటును తీర్చబోతున్నాడు. రేపు ఇప్పటం లో జరగబోయే జనసేన ఆవిర్భావ సభ కు హాజరు కాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
“వీరులారా ధీరులారా, జన సేన సైనికులారా !! రండి కదలి రండి కడలి అలగా తరలి రండి. నేను కూడా వస్తున్నాను. మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం, తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం, అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం. కలిసి పోరాడదాం” అని బండ్ల గణేష్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ సభ ను సక్సెస్ చేసేందుకు కార్య కర్తలు , అభిమానులు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. మరి రేపు వేదిక ఫై గణేష్ ఎలాంటి మాటల తూటాలు వదులుతారో చూడాలి.