
దర్శక ధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు వరల్డ్ వైడ్ గా రూ. 350 కోట్లు క్రాస్ చేసి..దుమ్ములేపుతుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి పెద్ద అడ్డంకి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రేపటి నుంచి రెండు రోజుల పాటు సమ్మెయూ పిలుపునిచ్చింది కమ్యూనిస్టు పార్టీలు.
మార్చి 28 మరియు 29 తేదీలలో సమ్మె చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ సమ్మె కు తెలుగు రాష్ట్రాలు సైతం మద్దతు ఇవ్వడం తో థియేటర్స్ సైతం మూతపడబోతున్నట్లు తెలుస్తుంది. ఒక వేళా ఇదే జరిగితే ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల కు ఇబ్బంది ఏర్పడినట్లే. ప్రస్తుతం మాత్రం థియేటర్స్ ను పూర్తిగా మూసివేయకుండా ఒక రెండు , మూడు షోస్ అయినా వేయాలనే ఆలోచనలో థియేటర్స్ యాజమాన్యం ఉన్నాయి. కానీ రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి అని ఆలోచిస్తున్నారు.