Homeటాప్ స్టోరీస్#NBK107 బాలయ్య లుక్ లీక్

#NBK107 బాలయ్య లుక్ లీక్

#NBK107 బాలయ్య లుక్ లీక్
#NBK107 బాలయ్య లుక్ లీక్

అఖండ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ..ప్రస్తుతం తన 107 మూవీ షూటింగ్ లో బిజీ అయ్యారు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. బాలయ్య కు జోడిగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

నిన్న శుక్రవారం నుండి ఈ మూవీ షూటింగ్ మొదలు అవ్వగా..మొదటి రోజే సినిమా సెట్ లోకి కొన్ని పిక్స్ లీక్ అవ్వడం మేకర్స్ ను షాక్ కు గురి చేసాయి. ఇందులో బాలకృష్ణ పిక్ సైతం లీక్ కు గురైంది. ఈ పిక్ లో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో బాల‌కృష్ణ కనిపిస్తున్నారు.త‌న‌దైన స్టైల్లో మెలితిప్పిన మీసాల లుక్‌తో బాలయ్య కనిపించడం తో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

- Advertisement -

వాస్తవ సంఘటనల ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని ,  బాల‌కృష్ణ ఇందులో ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో  నటిస్తుండగా.. క‌న్న‌డ స్టార్ దునియా విజ‌య్ ఇందులో విల‌న్‌గా న‌టిస్తున్నారు.ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుద‌ల చేసేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All