Homeటాప్ స్టోరీస్రూలర్ ఫస్ట్ డే కలెక్షన్స్: ఇలా అయితే కష్టమే!

రూలర్ ఫస్ట్ డే కలెక్షన్స్: ఇలా అయితే కష్టమే!

రూలర్ ఫస్ట్ డే కలెక్షన్స్: ఇలా అయితే కష్టమే!
రూలర్ ఫస్ట్ డే కలెక్షన్స్: ఇలా అయితే కష్టమే!

నందమూరి బాలకృష్ణ రూలర్ సినిమాకు తొలి షో నుండే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయిన విషయం తెల్సిందే. రెండు షేడ్స్ లో నటించిన బాలయ్య బాగానే కష్టపడినా కథ పాతది కావడం, కథనం ఆసక్తికరంగా లేకపోవడం, దర్శకత్వంలో కొత్తదనం లోపించడంతో రూలర్ ను తొలి ఆట నుండే ప్రేక్షకులు తిరస్కరించారు. అయితే బాలయ్యకున్న మాస్ బేస్ కారణంగా తొలిరోజు ఈ చిత్రం పర్వాలేదనిపించే స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టింది. బాలయ్యకున్న మార్కెట్ తో పోలిస్తే ఈ కలెక్షన్స్ తక్కువే అని చెప్పాలి. అయితే టాక్ కూడా బాగోకపోవడం, బాక్స్ ఆఫీస్ వద్ద రూలర్ కు విపరీతమైన పోటీ ఉండడంతో రూలర్ ఆ పోటీని తట్టుకుని ఎలా రాణిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

తొలిరోజు రూలర్ ప్రపంచవ్యాప్తంగా 5.59 కోట్లను వసూలు చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా 24 కోట్లు బిజినెస్ చేసిన రూలర్ కు ఇప్పుడు ఆ అమౌంట్ పెద్ద కొండలా కనిపిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే ప్రస్తుతం ఉన్న టాక్ తో రూలర్ బ్రేక్ ఈవెన్ చేరుకోవడం కష్టమే.

- Advertisement -

ప్రాంతాల వారీగా రూలర్ సినిమా తొలిరోజు కలెక్షన్స్ ను ఇక్కడ చూద్దాం.

నైజాం: 0.70 కోట్లు

సీడెడ్: 1.1 కోట్లు

గుంటూరు: 1.35 కోట్లు

ఉత్తరాంధ్ర: 0.30 కోట్లు

తూర్పు గోదావరి: 0.28 కోట్లు

పశ్చిమ గోదావరి: 0.24 కోట్లు

కృష్ణా: 0.20 కోట్లు

నెల్లూరు: 0.23 కోట్లు

ఫస్ట్ డే మొత్తం షేర్: 4.40కోట్లు

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.85 కోట్లు

ఓవర్సీస్: 0.34 కోట్లు

వరల్డ్ వైడ్ ఫస్ట్ డే షేర్: 5.59 కోట్లు

బాలకృష్ణ ప్రస్తుతం తన తర్వాతి సినిమాకు సన్నద్ధమవుతున్నాడు. తన 106వ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ ఆఖరు వారం నుండి మొదలవుతుంది అని అన్నారు కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ చిత్రానికి పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే జూన్ లేదా జులైలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All