
నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం అఖండపై బాగానే అంచనాలు ఉన్నాయి. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా కావడంతో అందరూ ఈ చిత్ర విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముందు రెండు సినిమాలు సింహా, లెజండ్ మంచి విజయాలు సాధించిన విషయం తెల్సిందే.
ఇక అఖండ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. లాస్ట్ షెడ్యూల్ గోవాలో త్వరలోనే మొదలవుతుంది. ఈ షెడ్యూల్ లో రెండు సాంగ్స్ ను కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారు. దీంతో అఖండ పూర్తవుతుంది. ఈ చిత్రం దసరాకు విడుదలవుతుందని మొదటి నుండి వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు వద్దు అనుకుంటున్నారట.
దసరా రిలీజ్ అంటే హడావిడి అవుతుంది కాబట్టి రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని భావించినట్లు సమాచారం. మరి దసరా రేసు నుండి తప్పుకుంటే మరో డేట్ పట్టుకోవడం కష్టమే. దీపావళికి రజినీకాంత్ అన్నాత్తే, వరుణ్ తేజ్ గని విడుదలవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొంత కాలం ఆగక తప్పదు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.