
నందమూరి బాలకృష్ణ ఫామ్ లో లేకపోయినా కానీ క్రేజ్ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం తనకు అచొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ అఖండ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నిన్నటితో పూర్తయింది. యాక్షన్ దర్శకుడు స్టన్ శివ ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్లుగా వెల్లడించాడు.
దాదాపుగా 80 వర్కింగ్ డేస్ లో అఖండ యాక్షన్ పార్ట్ ను చిత్రీకరించినట్లు వెల్లడించాడు. బాహుబలి తర్వాత అన్ని ఎక్కువ రోజులు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన చిత్రంగా అఖండ నిలిచింది. ఇంటర్వెల్, ప్రీక్లయిమాక్స్, క్లైమాక్స్ లో యాక్షన్ ఘట్టాలు హైలైట్ గా రూపొందుతాయని ఆయన వెల్లడించాడు. అఖండలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయని వినికిడి. ఈసారి బోయపాటి శ్రీను యాక్షన్ అండ్ ఎమోషన్ పై ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.
అసలు బోయపాటి శ్రీను సినిమాలంటేనే యాక్షన్, ఎమోషన్ ఎక్కువగా ఉంటాయి. ఈసారి ఫోకస్ వీటిపై మరింతగా పెరిగింది. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.